calender_icon.png 28 July, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పందులకు నిలయంగా దోమకొండ సబ్ సెంటర్

25-07-2025 12:15:34 AM

  1. రూ.28 లక్షల నిధులు వృధా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం
  2. అసంపూర్తి పనులతో గర్భిణీలు, నెలల పిల్లలకు తీవ్ర ఇబ్బందులు

దోమకొండ, జూలై 24 (విజయక్రాంతి): పందులకు నిలయంగా దోమకొండ వైద్య ఆరోగ్యశాఖ  పరిధిలోని సబ్ సెంటర్ మారింది. ఏడాదిన్నర క్రితం ప్రారంభించిన పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో పందులకు నిలయంగా, అశ్లీల, అసాంఘిక శక్తులకు నిలయంగా మారిపోయింది. వైద్య ఆరోగ్యశాఖ, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు సబ్ సెంటర్ నిర్మాణానికి రూ. 28 లక్షలు ఖర్చు చేసిన గర్భిణులకు చిన్న పిల్లలకు బాలింతలకు ఉపయోగము  లేకుండా వృధాగా మిగిలిపోయింది.

సబ్ సెంటర్ లో ప్రతిరోజు పదుల సంఖ్యలో గర్భిణీలు బాలింతలు నెలల వయసున్న పిల్లలకు అత్యవసర వైద్య సేవలు టీకాలు, ఇంజక్షన్లు, మందుల సరఫరా లాంటి అతి ముఖ్యమైనవి ప్రాథమిక వైద్య శాఖ లో అందించాల్సి ఉండగా పనులు పూర్తికాకపోవడంతో ప్రయోజనం లేకుండా పోతుంది. ముఖ్యమైన వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. అలాంటిది అసంపూర్తిగా  ఏడాదిన్నర క్రితం శంకుస్థాపన చేసిన దోమకొండ సబ్ సెంటర్ నిర్మాణం సగంలో వదిలివేయడంతో లక్షలాది రూపాయలు వృధా అయ్యాయి.

గర్భిణీలకు, చిన్నపిల్లలకు, బారింతలకు, అందాల్సిన వైద్య సేవలు అందకుండా పందులకు నిలయంగా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిపో యింది. నిర్మాణంలో కూడా నాణ్యత పనులు జరగలేదని గ్రామస్తులు ఫిర్యాదు చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అభివృద్ధి నిధులు 28 లక్షల రూపాయలతో గత ఏడాది కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ శంకుస్థాపన చేశారు.

అసంపూర్తిగా నిర్మాణం

వైద్యశాఖ ఆధీనంలోకి రాకపోవడంతో సబ్ సెంటర్ నూతన భవనంలో పందులు స్త్వ్రర విహారం చేస్తున్నాయి. అసాంఘిక  అశ్లీల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ నిధులతో కాంట్రాక్టర్ , మాజీ ఉపసర్పంచ్‌లు కలిసి  నిర్మించారు. నిర్మా ణంలో నాణ్యత లోపాలు ఉన్నాయి. అసంపూర్తి పనులతో భవనం పూర్తి కాలేదు. వైద్య ఆరోగ్య శాఖకు స్వాధీనం కాలేదు.

దరిమిలా దోమకొండ సబ్ సెంటర్ పందు ల నిలయంగా మారిపోయింది. ప్రభుత్వ ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోని దోమకొండ సబ్ సెంటర్ ను ఉపయోగం లోకి తీసుకువచ్చి గర్భిణీలు, బారింతలు, నెలల వయసున్న పిల్లలకు అత్యవసర వైద్య సహాయం అందేలా, నిర్మాణం పనులు పూర్తి చేసి వైద్య ఆరోగ్యశాఖ పనులు కొనసాగించాలని దోమకొండ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

అసంపూర్తిగా భవనం

పనులు పూర్తి కాకపోవడంతో బిల్లులు రాలేదని సాకుతో పనులు వదిలివేయడంతో అటువైద్య ఆరోగ్యశాఖకు స్వాధీనం చేయలేదు. ఇటు కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయలేదు. దాంతో మహిళలకు చిన్న పిల్లలకు అందాల్సిన వైద్య సేవలు అందకుండా పందుల నిలయం గా మారిపోవడంతో దోమకొండ మండల కేంద్రం, పరిసర గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.