28-07-2025 09:35:47 AM
హుజూర్ నగర్,(చింతలపాలెం): కృష్ణానదిలో(Krishna River) చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతిచెందిన సంఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో నక్కగూడెం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది... స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం..నక్కగూడెం గ్రామానికి చెందిన బాణావత్ నాగరాజు (30)రోజు మాదిరిగా ఆదివారం ఉదయం చేపల వేటకు వెళ్లాడు.తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో తెప్పపై నుంచి కాలు జారి కృష్ణ నదిలో పడిపోయాడు.చేపల వేటకు వెళ్లిన నాగరాజు ఎంత సేపటికీ రాకపోవడంతో తోటి వారికి అనుమానం వచ్చి వారు వెళ్లి చూడగా నాగరాజు కృష్ణా నదిలో పడి కనిపించడంతో కృష్ణనది నుంచి బయటకు తీసుకువచ్చి చూడగా అప్పటికే మృతిచెందాడు.మృతి చెందిన నాగరాజుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.చేపల వేటకు వెళ్లిన కృష్ణా నదిలో కాలు జారీపడి నాగరాజు మృతి చెందడంతో నక్కగూడెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చింతలపాలెం యస్ఐ సందీప్ రెడ్డి తెలిపారు.