తెలంగాణ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీనుబాబుకు ఘనసన్మానం
మంథని,(విజయక్రాంతి): సికింద్రాబాద్‌లోని స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో బ్రాహ్మిణ్ వెల్ఫేర్ ట్రస్ట్, బ్రాహ్మిణ్ అఫిషియల్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(Telangana TPCC State General Secretary) దుద్దిళ్ళ శ్రీను బాబు ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు బ్రాహ్మిణ్ సంఘ నాయకులు, ప్రముఖులు పాల్గొని దుద్దిళ్ళ శ్రీను బాబు(Duddilla Srinu Babu) ను సేవా పరమతను ప్రశంసించారు. ఆయన సామాజిక సేవ, ప్రజా సమస్యలపై పట్టుదల, రాజకీయాల్లో విశ్వసనీయతకు గుర్తింపుగా ఈ సత్కారించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించబడినాయిఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.




