20 March, 2026 | 7:22 AM

కొత్త ‘సాలు’కు అపూర్వ స్వాగతం

20-03-2026 12:48 AM
  1. భక్తులతో పోటెత్తిన దేవాలయాలు పంచాంగ శ్రవణం 
  2. వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టిన అన్నదాతలు 

మహబూబాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): పరాభవ సంవత్సరాది పర్వదిన వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. కొత్త సాలుకు ప్రజలు అపూర్వక స్వాగతం పలికారు. కొత్త దుస్తులు ధరించి షడ్రుచులతో తయారుచేసిన ఉగాది పచ్చడి ఆరగించారు. పప్పు ధాన్యాలతో తయారు చేసిన భక్షాలను ఆరగించారు. దేవాలయాలకు వెళ్లి తమ ఇష్ట దేవతలకు మొక్కులు సమర్పించుకున్నారు.

అనంతరం ఆలయాల్లో నిర్వహించిన పంచాంగ శ్రవణం లో పాల్గొని పరాభవ నామ సంవత్సరంలో తమకు లాభనష్టాలను అడిగి తెలుసుకున్నారు. అన్నదాతలు కొత్తసాలు సందర్భాన్ని పురస్కరించుకొని వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. పశుసంపదకు పూజలు నిర్వహించి ఈ సంవత్సరం మంచి పంటలు పండాలని, పాడి పశుసంపద చల్లగా ఉండాలని వేడుకున్నారు. ప్రసిద్ధిగాంచిన దేవాలయాలతో పాటు గ్రామాల్లోని దేవాలయాలు భక్తులతో కొత్త శోభను సంతరించుకున్నాయి.