గంట నడిస్తే రూ.4వేలు
వినూత్న ఉద్యోగాన్ని ప్రటించిన టెస్లా
కాలిఫోర్నియా: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ నేతృత్వంలోని విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. వినూత్న ఉద్యోగవకాశాన్ని ప్రకటించింది. రోజుకు ఏడుగంటలు చొప్పున నడిస్తే గంటకు రూ.4వేలు చొప్పున.. ఏడుగంటలకు రూ.28వేల వేతనం అందించనుంది. ఆప్టిమస్ పేరిట టెస్లా రోబోను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రోబోకు శిక్షణనివ్వడం కోసం వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్నవారి నుంచి టెస్లా కంపెనీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అధికారికంగా ఈ ఉద్యోగాన్ని ‘టెస్లా కలెక్షన్ ఆపరేటర్’గా పేర్కొంది. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయినవారు.. మోషన్ క్యాప్చర్ సూట్, వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌ను ధరించి నిర్దేశిత మార్గాల్లో నడవాల్సి ఉంటుంది.
ఇలా రోజుకు ఏడుగంటలు పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఉద్యోగానికి కొన్ని శారీరక ప్రమాణాలను కూడా కలిగి ఉండాలని టెస్లా పేర్కొంది. ఎత్తు 5.7 నుంచి 5.1 అడుగుల మధ్య ఉండాలి. 13కిలోల బరువు మోయగలిగే సామర్థం కలిగి ఉండాలి. అయితే అనుభవం, నైపు ణ్యం, చేసే పనిని బట్టి ప్యాకేజీ మా రుతుంది. మెడికల్, బీమా, రిటైర్‌మెంట్ ప్రయోజనాలుఉంటాయని కంపెనీ ప్రతినిధులు తెలి పారు. సెలెక్ట్ అయినవారు కాలిఫోర్నియాలోని పాలోఆల్టోలో పనిచేయాల్సి ఉంటుంది.






