మస్క్‌కు మంత్రిగిరీ ఇస్తా
అమెరికా అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ ఓపెన్ ఆఫర్
వాషింగ్టన్, ఆగస్టు 20: ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల్లో తనకు బీభత్సమైన మద్దతు దారుగా నిలిచిన బిజినెస్ టైకూన్ ఎలాన్ మస్క్‌కు రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. తాను ఎన్ని కల్లో గెలిచి అధ్యక్షుడిని అయితే ట్రంప్‌ను మంత్రిగా నియమించుకొంటానని ప్రకటిం చారు. రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే మస్క్‌కు మంత్రిగా లేదంటే సలహాదారుగా పదవి ఇస్తా. ఆయన కోరుకుంటే తప్పకుండా తీసుకొంటా’ అని తెలిపారు. ట్రంప్ ఎన్నికల ప్రచారం కోసం మస్క్ ఇప్పటికే మిలియన్ల కొద్ది డాలర్లు విరాళంగా ఇచ్చారు. ట్రంప్ ఆఫర్‌కు మస్క్ సానుకూలంగా స్పందించారు. ‘సేవ చేసేందుకు సిద్ధం’ అని తన సొంత కంపెనీ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.






