18 April, 2026 | 2:19 AM

హామీని నిలుపుకోలేని అసమర్థ సీఎం

18-04-2026 12:48 AM
  1. సిగాచి బాధితులకు కోటి సాయమంటూ నమ్మబలికారు
  2. మాట ఇచ్చి తప్పడం రేవంత్‌రెడ్డికి అలవాటు
  3. రూ.కోటి పరిహారం వెంటనే విడుదలచేయాలి
  4. మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్

హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): సిగాచి ప్రమాద బాధితులకు ఇచ్చిన హామీని కూడా నిలుపుకోలేక తన అసమర్థతను సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి చాటుకున్నారని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. నాడు కోటి రూపాయల సాయమంటూ సిగాచి బాధితులను నమ్మబలికి అందులో సగం కూడా వారికి చేర్చని రేవంత్‌రెడ్డి నయవంచనలో తనను మించినవారు లేరని నిరూపించుకున్నారని ఎద్దే వాచేశారు.

ఆ పూటకు మాటలు చెప్పడం.. ఆ తర్వాత తాను చెప్పిన మాటలకే విలువ ఇవ్వకపోవడం రేవంత్‌రెడ్డికే చెల్లిందని శుక్రవారం ఎక్స్ వేదికగా విమర్శించారు. సిగాచి పరిశ్రమ ప్రమాదంలో 54 మంది అమాయక కార్మికులు ప్రాణాలు కోల్పోతే, ఆ బాధితుల కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు అసెంబ్లీ సాక్షిగా బట్టబయలయ్యాయని తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు వివేక్, దామోదర రాజ నర్సింహ.. మృతదేహాల సాక్షిగా ఒక్కో కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించారని, కానీ ఇదంతా కంటితుడుపు చర్యే అని, బాధితులకు జరిగిన న్యాయం శూన్యమని, ప్రభు త్వం అసెంబ్లీలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంతో తేటతెల్లమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

యాజమాన్యం, ప్రభుత్వం కుమ్మక్కై పరిహారం లెక్కల్లో చేస్తున్న మో సం అంతాఇంతా కాదని, ప్రభుత్వం అసెంబ్లీలో సమర్పించిన అధికారిక లెక్కల ప్రకా రం, 54 మంది బాధితులకు కలిపి ఇప్పటివరకు చెల్లించిన రూ.24.51 కోట్లను విభ జించి చూస్తే, ఒక్కో కార్మికుడి కుటుంబానికి సగటున అందిన పరిహారం కేవలం రూ.45.40 లక్షలు మాత్రమేనని స్పష్టంచేశారు. సీఎం హామీ ఇచ్చిన రూ.కోటి పరిహా రంలో ఇంకా ఒక్కో కుటుంబానికి దాదాపు రూ.54.60 లక్షలు, మొత్తంగా రూ.29.48 కోట్ల బకాయిని ఈ ప్రభుత్వం ఎగ్గొట్టి బాధితులను నట్టేట ముంచిందని మండిప డ్డారు.

కోట్లు ఇస్తామని గొప్పలు చెప్పి, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో బాధిత కుటుంబానికి లక్ష రూపాయలు మాత్రమే చెల్లించడం అత్యంత శోచనీయమన్నారు. యాజమాన్యం తాము 40 నుంచి 42 లక్షల రూపాయలు ఇస్తున్నామని కోర్టుల ముందు ఒప్పుకుందని, అసలు నిజమేంటంటే, వారు సొంతంగా ఇచ్చిన రూ.25 లక్షలకు.. కార్మికులు చనిపోవడం వల్ల చట్టబద్ధంగా వారికి రావాల్సిన పీఎఫ్, ఈఎస్ ఐ, లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులను కూడా కలుపుకుని ఈ లెక్కలు చూపిస్తున్నారని వివరిం చారు.

చికిత్సపొందుతూ చనిపోయిన కార్మికుల వైద్య ఖర్చులను కూడా ఈ అరకొర పరిహారంలోనే కోత విధించడం దారుణమని, ఇక ప్రమాదంలో కాలి బూడి దై ఆచూకీ దొరకని 8 మంది కార్మికుల కుటుంబాలను డెత్ సర్టిఫికెట్ల కోసం నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పించుకున్న దుర్మార్గ ప్రభుత్వం ఇది అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తూతూ మంత్రంగా ఎండీని అరెస్టు చేయడం, వెంటనే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చేలా పరోక్షంగా సహకరించడం చూస్తుంటే..

ప్రభుత్వానికి, కంపెనీ యాజమాన్యానికి మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందాలు ఏమిటో అర్థం అవుతూ నే ఉందని తెలిపారు. ప్రభుత్వానికి ఏమా త్రం చిత్తశుద్ధి ఉన్నా వందల కోట్ల టర్నోవర్ ఉన్న సిగాచి కంపెనీ డైరెక్టర్ల ఆస్తులను రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద అటాచ్ చేయాలని, వాటిని అమ్మి అయినా బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఏ కొర్రీలు లేకుండా కోటి పరిహారాన్ని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.