18 August, 2026 | 1:15 AM

అక్రమ పశువధకు అడ్డుకట్ట వేయాలి

18-08-2026 12:00 AM

వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి  గడప కిషోర్‌రావు 

వేములవాడ, ఆగస్ట్ 18, (విజయ క్రాంతి): గోవధశాలలు, బిర్యానీ కేంద్రాలపై చర్యలు తీసుకోవాలి. వేములవాడ పట్టణంలోని అక్రమ పశువధ, అనుమతులు లేని గోవధశాలలు, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కళ్యాణి బిర్యానీ సెంటర్లపై స మగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి గడప కిషోర్రావు కోరారు. ఈ మేరకు సోమవారం వేములవాడ అర్బన్ మండల అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

రాజన్న దేవస్థానంలో కోడె మొ క్కులు చెల్లించే ప్రత్యేక సంప్రదాయం ఉన్నందున గోవులు, కోడెలను భక్తులు పవిత్రంగా భావిస్తారని తెలిపారు. పశువైద్యా ధికారి ధ్రువపత్రాలు, సంబంధిత అనుమతులు లేకుండా పశువధ జరుగుతు న్నట్లయితే అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించాలని కోరారు.

అనుమతులు లే కుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కళ్యాణి బిర్యానీ సెంటర్లు, ఇతర మాంస విక్రయ కేంద్రాలను తనిఖీ చేసి, ఉల్లంఘనలు గుర్తిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకో వాలని విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రజ లు, భ క్తుల మనోభావాలను గౌరవిస్తూ అధికారు లు ఈ అంశంపై తక్షణమే స్పందించాలని కిషోర్రావు కోరారు.