17 May, 2026 | 1:19 AM

వారాసిగూడలో నకిలీ వైద్యుడు అరెస్ట్

17-05-2026 12:00 AM

భారీగా ఇంజక్షన్లు, మొబైల్ ఫోన్ స్వాధీనం

సికింద్రాబాద్, మే 16 (విజయక్రాంతి): ఎలాంటి అర్హత లేకుండా అక్రమంగా క్లినిక్ నిర్వహిస్తూ, నకిలీ వైద్యంతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుడిని వారాసిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. వారాసిగూడ పరిధిలో ‘మాధవ మెడికల్ షాప్‘ పేరుతో సాగుతున్న ఈ అక్రమ దందాను పోలీసులు పక్కా  ప్రణాళికతో చేధించారు. నిందితుడు నన్నుట మాధవ్ (42) వారాసిగూడ, స్వస్థలం భూపాలపల్లిగా పోలీసులు గుర్తించారు.

ఎక్కువ డబ్బు సంపా దించాలనే దురాశతో ఇంటర్మీడియేట్ చది వి అర్హత లేకపోయినా వైద్యం చేస్తున్నాడని చెప్పారు. కుంట అర్చన అనే తన స్నేహితురాలికి చెందిన డ్రగ్ లైసెన్స్‌ను అడ్డం పెట్టుకు ని అక్రమంగా వైద్య ప్రాక్టీస్ ప్రారంభించాడన్నారు. పోలీసులు నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఇతని వద్ద నుంచి డైక్లోఫెనిక్, టీటీ ఇంజక్షన్ వైల్స్, మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసు కున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ప్రజలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని, గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లోనే చికిత్స చేయించుకోవాలని ఇన్స్‌పెక్టర్ విజ్ఞప్తి చేశారు.