ఉత్తమ పర్యావరణ వీడియోలకు ఆహ్వానం
హైదరాబాద్, మే 10( విజయక్రాంతి) : పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వీడియోలను పంపాలని పర్యావరణ జౌత్సాహితులను కాలుష్య నియంత్ర మండలి (పీసీబీ) కోరింది. ఉత్తమ వీడియోలను పీసీ బీ యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామని తెలిపింది. అంతేకాదు, ఉత్తమ వీడియోను ఎంపిక చేసి రూ. 7500 రివార్డు అందజేస్తామని వెల్లడించింది. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడంలో భాగంగా నూతన యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించినట్లు తెలిపింది.
వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు.. పరిశ్రమ, కాలుష్య నియంత్రణ, వ్యర్థాల నిర్వహణలో తాము అనుసరిస్తున్న ఉత్తమ పర్యావరణ పద్ధతు లను షార్ట్ ఫిల్మ్‌ల రూపంలో తీసి పంపించాలని కోరింది. వాటిలో ఉత్తమ వీడియోను ఎంపిక చేసి రివార్డు అందజేస్తామని పేర్కొంది. పూర్తి వివరాలకు 9177303127లో సంప్రదించాలని కోరింది.






