1 May, 2026 | 7:15 PM

Breaking News

పంద్రాగస్టు నాటికి రుణమాఫీ అమలు

11-05-2024 12:30 AM

మంత్రి తుమ్మల స్పష్టం 

హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో పంద్రాగస్టు నాటికి రైతు రుణమాఫీ అమలు చేసి తీరుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పష్టం చేశారు. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ప్రభుత్వం ఇతర పథకాల అమలుకు ప్రణాళిక రూపొందిస్తుందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఈ వానా కాలం నుంచి పంటల బీమా పథకంలో ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి అమలు చేస్తుందన్నారు.

చిన్న, సన్నకారు రైతులు వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రుణ సహాయం అందేలా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అధిక ఆదాయం సమకూర్చే పంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహిస్తామని, ఇప్పటికే సంబంధిత వర్సి టీలకు, శాఖలకు ఆదేశాలిచ్చినట్టు పేర్కొన్నారు. కేంద్రం గడిచిన పదేళ్లలో రైతుల నికర ఆదాయం పెంచే ఏ ఒక్క పథకం తీసుకు రాలేకపోయిందని విమర్శించారు.