1 May, 2026 | 9:28 PM

మే డే అమరవీరుల ఆశయాలను సాధిస్తాం

01-05-2026 08:15 PM

-రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు

ముకరంపుర,(విజయ క్రాంతి): ఈరోజు 140 వ మే డే సందర్భంగా "ధర్మపురి మునిసిపల్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు  మాట్లాడుతూ, 19 వ శతాబ్దంలో కార్మికులు 12 గంటలు 16 గంటలు పని చేయాల్సి వచ్చేదని అట్టి పనిని నిరసిస్తూ  చికాగో నగరంలో కార్మికుల హక్కుల కోసం 1886లో హే మార్కెట్లో కార్మికులు పెద్ద పోరాటం చేసి ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకోవాలని పెద్ద ఎత్తున ర్యాలీ తీసిన సందర్భంలో అక్కడ ఉన్న నిరంకుశ పాలకులు,కాల్పులు జరిపి,కార్మికులను పొట్టన పెట్టుకున్నారని వారి రక్తంలో తడిసినదే ఈ ఎర్రజెండా అని అన్నారు.  ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల వ్యతిరేక విధానాల అవలంబిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కవ్వంపెల్లి రవి,   35 మంది కార్మికులు పాల్గొన్నారు.