calender_icon.png 3 February, 2026 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్దిపేట జిల్లాలో వేడెక్కుతున్న మున్సిపల్ ఎన్నికలు

03-02-2026 02:28:49 AM

ఓటర్లను అకట్టుకునేందుకు విన్యాసాలు 

సమస్యలే ఎరగా చూపుతూ ప్రచారం

సిద్దిపేట, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా పరిధిలోని హుస్నాబాద్, గ జ్వేల్, చేర్యాల, దుబ్బాక మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి రోజురోజుకు ఉద్ధృతంగా మారుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు ప్ర చారాన్ని మరింత వేగవంతం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో నిమగ్నమ య్యాయి. ప్రతి వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ అభ్యర్థులు తమ హామీలను ప్ర జలకు వివరిస్తున్నారు. ప్రధాన పార్టీల ఆశీస్సులు తమకే ఉన్నాయని, పార్టీ నాకే బీ ఫామ్ ఇస్తుంది అంటూ జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. సమస్యలనే ఎరగా చూ పుతూ పరిష్కారానికి నేనే కృషి చేస్తానం టూ, నా వల్లనే అభివృద్ధి జరుగుతుంది అ న్నట్టు వ్యక్తిగత హామీలు ఇస్తున్నారు. ఓటర్లను అకట్టుకునేందుకు అనేక విన్యాసాలకు పాల్పడుతున్నారు.

హుస్నాబాద్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు, తాగునీరు, పారిశుధ్యం అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. గజ్వేల్లో మౌలిక వసతులు, రోడ్ల విస్తరణ, యువత ఉపాధి అవకాశాలు ఎన్నికల ప్రధాన అజెండాగా మారాయి. చేర్యాల మున్సిపాలిటీలో పట్టణ విస్తరణ, డ్రైనేజీ సమస్యలపై ఓటర్లు అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. దుబ్బాకలో మహిళా సంక్షే మం, పేద ల గృహనిర్మాణం, వ్యాపారులకు సౌకర్యాలు వంటి అంశాలు ప్రచారంలో ప్రధానంగా వినిపిస్తున్నాయి. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీలో ఉండటంతో రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారింది.

యువతతో పాటు మహిళా ఓటర్లు కూడా ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు. కొన్నిచోట్ల పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం సాగుతుండగా, ఎన్నికల సంఘం నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది. భద్రతా చర్యలను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఎలాంటి అ వాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాల వరకు తీసుకువెళ్లే విధానంపై పార్టీల మధ్య వ్యూహాలు రూపొందు తున్నాయి. సిద్దిపేట జిల్లాలోని 4 మున్సిపాలిటీల ఎన్నికలు రాజకీయంగా హోరాహోరీ గా సాగుతున్నాయి. ఫలితాలు జిల్లాలో భవిష్యత్ రాజకీయ దిశను నిర్ధారించనున్న నేపథ్యంలో ప్రజల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది.