18 July, 2026 | 4:08 PM

ప్రమాణ స్వీకారానికి అనుకోని అతిథి

11-06-2024 02:06 AM

రాష్ట్రపతి భవన్‌లో కనిపించిన జంతువు

న్యూఢిల్లీ, జూన్ 10: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం సాయంత్రం ప్రధాని మోదీతో సహ 71 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అధికారిక కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన అతిరథ మహారథుల తోపాటు ఈ అనుకోని అతిథి హాజరైంది. మధ్యప్రదేశ్‌కు చెందిన దుర్గాదాస్ ఉయికె కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో వెనుక నుంచి ఓ జంతువు వెళ్లింది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. కట్టుదిట్టమైన భద్రత వలయం మధ్య జంతువు ఎలా సంచరిస్తుందని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తుండగా, మరికొందరు ఎవరో ఔత్సా హికుడు కృత్రిమ మేధ ద్వారా (ఏఐ) జంతువును సృష్టించాడని కామెంట్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా అక్కడ సంచరించింది పులి పిల్ల అని తేల్చేస్తున్నారు. వీడియాలో కనిపించించిన జంతువు పిల్లి అని ప్రాథమికంగా తెలుస్తున్నది. దీనిపై రాష్ట్రపతి భవన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు.