18 July, 2026 | 4:25 PM

Breaking News

భూక్య రవి నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పాఠశాలలో మొక్కలు నాటిన కలెక్టర్   •   100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   గడ్డన్న సుద్ద వాగు ప్రాజెక్టు సందర్శించిన కలెక్టర్   •   ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు మెరుగుపరచాలి   •   జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో సర్వజ్ఞ స్కూల్ విద్యార్థికి కాంస్య పతకం   •   ప్రియదర్శిని మహిళా ఇంజినీరింగ్ ఆటోనామౌస్ కళాశాలలో యువ నాయకత్వం   •   విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి   •   డీటిబ్ల్యూఓ జాదవ్ అంబాజీకి సన్మానం   •   సోనం వాంగ్చుక్ దీక్షకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు   •  

బర్త్‌డే పార్టీకని పిలిచి లైంగిక దాడి

11-06-2024 02:05 AM

చెన్నై, జూన్ 10: చెన్నైలో ఓ బాలికను బర్త్‌డే పార్టీకి ఆహ్వానించి లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అన్నానగర్‌లో ఉండే 15 ఏండ్ల బాలిక స్థానికంగా 11వ తరగతి చదువుతున్నది. ఇటీవల స్థానికంగా ఉన్న ఓ కెఫేలో ఓ మహిళ ఆ బాలికతో పరిచయం పెంచుకొన్నది. ఆ చనువుతో తన ఇంట్లో పుట్టినరోజు పార్టీ ఉందని చెప్పి ఆహ్వానించింది. బాలిక వెళ్లగానే మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చింది. ఆ పానీయం తాగిన బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగానే మహిళకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు.

ఈ విషయాన్ని బయట చెప్తే చంపేస్తానని మహిళ బెదిరించటంతో బాలిక భయపడిపోయి తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదు. అయితే, రెండురోజుల క్రితం బాలిక ముభావంగా ఉండటాన్ని గమనించి ఆమె అక్క ఏమైందని నిలదీయటంతో అసలు విషయం బయటపడింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకొన్న పోలీసులు సోమేశ్, ప్రతీక్ష అనే నిందితులను అరెస్టు చేశారు. విలియం అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.