31 August, 2026 | 2:38 AM

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మరపు రానిది

31-08-2026 12:00 AM

ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే విజయరమణ రావు 

సుల్తానాబాద్, ఆగస్టు 30 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని సాయిరాం ఫంక్షన్ హాల్ లో సుల్తానాబాద్ ప్రభుత్వ పాఠశాల లో 1973-74 సంవత్సరంలో పదవ తరగతి విద్యను అభ్యసించి 52 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం  ఏర్పాటు చేసిన  పూర్వ విద్యార్థుల ఆత్మీయ అపూర్వ కలయిక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  ప్రభుత్వవిప్ , పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు హాజరయ్యారు,

ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మరుపు రానిది అన్నారు, ఒక వేదికపై కలుసుకున్న పూర్వ విద్యార్థులు చిన్ననాటి మధుర జ్ఞాపకాలు నెమర వేసుకున్నారు, తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి ఆత్మీయంగా సన్మానించారు, ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకుడు, మాజీ జెడ్పిటిసి డాక్టర్ అయిల రమేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ను ఘనంగా సన్మానించారు,

అనంతరం  అందరూ కలిసి ఆటపాటలతో సంబరాలు జరిపారు, ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి,  గ్లోబల్ రచయిత మహమ్మద్ అలీ రచించిన ది సోయల్ రిమెంబర్స్ ఎవ్రీథింగ్ (నేల ప్రతి విషయాన్ని గుర్తుంచుకుంటుంది) బుక్కును ఎమ్మెల్యే విజయ రమణారావు ఆవిష్కరించారు,  ఇందులో మున్సిపల్ చైర్మన్ బిరుదురాధాకృష్ణ ,పలువురు ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు..