విభిన్న సంస్కృతులకు నిలయం పటాన్‌చెరు
ఓనం వేడుకల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
రామచంద్రాపురం, ఆగస్టు 30 : విభిన్న సంస్కృతులకు, ఆచారాలకు నిలయం పటాన్చెరు నియోజకవర్గమని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి(Gudem Mahipal Reddy) అన్నారు. రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నాయర్ వెల్ఫేర్ అసోసియేషన్(Nair Welfare Associatio) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓనం వేడుక(Onam celebrations)ల్లో ఎమ్మెల్యే జిఎంఆర్(Gudem Mahipal Reddy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళ ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఓనం పండుగను రామచంద్రాపురంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు.
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే పండుగలు ప్రజల మధ్య సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరి పండుగలు, సంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పటాన్చెరు నియోజకవర్గాన్ని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ కో ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్, ప్రమోద్ గౌడ్, ఐలేష్, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

లింగాయత్ సమాజం పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే
పటాన్‌చెరు, ఆగస్టు 30 : పటాన్ చెరు వీరశైవ సమాజం ఆధ్వర్యంలో పటాన్ చెరు పట్టణంలోని ఉమామహేశ్వర దేవాలయం నుండి బొంతపల్లి వీరభద్ర స్వామి దేవాలయం వరకు చేపట్టిన 19వ మహా పాదయాత్రను ఆదివారం ఉదయం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు,
అనంతరం ఆయన మాట్లాడుతూ 19 సంవత్సరాలుగా పాదయాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం ప్రతినిధులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.






