22 April, 2026 | 1:36 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

మరిచిపోని మధుర ఘట్టం

19-12-2025 01:13 AM
  1. అరుదైన యాదృచ్ఛికం!

‘ప్రపంచ కవలల దినోత్సవం’ రోజే స్వప్న హాస్పిటల్‌లో కవలల జననం

నిర్మల్, డిసెంబర్ 1౮ (విజయక్రాంతి): ప్రపంచవ్యాప్తంగా కవలల దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ, నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్వప్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక అరుదైన, సంతోషకరమైన ఘటనకు సాక్షిగా నిలిచింది. సరిగ్గా కవలల దినోత్సవం రోజే ఈ ఆసుపత్రిలో కవల పిల్లలు జన్మించడం అందరినీ ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేసింది. గైనకాలజిస్ట్ శైలజ నేతృత్వంలో ఒక గర్భిణికి విజయవంతంగా ప్రసవం జరగగా, ఆమె కవలలకు జన్మనిచ్చింది.

తల్లీ బిడ్డలు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వప్న శశికాంత్ మాట్లాడుతూ.. ‘ప్రపంచ కవలల దినోత్సవం రోజే మా హాస్పిటల్లో కవలలు జన్మించడం అనేది చాలా అరుదైన, మర్చిపోలేని యాదృచ్ఛికం. వైద్యురాలిగా నాకు ఇది ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చింది. ఆ కుటుంబానికి కూడా ఒక ప్రత్యేక జ్ఞాపకంగా మిగిలిపోతుంది’ అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయం తెలియడంతో హాస్పిటల్ సిబ్బంది,  బంధువులు సంబరాలు చేసుకున్నారు. కవలల దినో త్సవం రోజున పుట్టిన ఆ చిన్నారులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.