19-12-2025 01:13:23 AM
2029లో ఇవే ఫలితాలు పునరావృతం
హైదరాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాంతి) : మూడు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాలు సాధించిందని, ఇవే ఫలితాలు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృతమవుతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని 94 శాసనసభా నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగితే 87 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అధిక్యత సాధించింద న్నారు. ఇక బీఆర్‌ఎస్ ఆరు నియోజకవర్గాలు (జనగాం, సిద్దిపేట, సిరిసిల్ల, సిర్పూర్ కాగజ్‌నగర్, దుబ్బాక, హుజూరాబాద్), బీజేపీ ఒక నియోజకవర్గంలో (ముథోల్) ఎక్కువగా సర్పంచ్ స్థానాలను ల్లో విజయం సాధించాయని సీఎం పేర్కొన్నారు.
రాష్ట్రంలోని 12,728 గ్రామాలకు గాను 12,702 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయని, కాంగ్రెస్ పార్టీ 66 శాతం సీట్లను గెలుచుకుందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రెండేళ్ల తర్వా త ప్రజల వద్దకు వెళ్లితే సంపూర్ణమైన విశ్వా సం ప్రకటించారని, ఇది ప్రజాపాలనపై ప్రజ లు ఇచ్చిన తీర్పు అని చెప్పారు. గజ్వేల్ ని యోజకవర్గ ప్రజలు కేసీఆర్‌ను తిరస్కరించారని, అక్కడ కాంగ్రెస్ పార్టీనే మెజార్టీ స్థానా లు గెలుచుకున్నదని సీఎం పేర్కొన్నారు.
పార్టీ కోసం కష్టపడి పనిచేసిన పార్టీ కార్యకర్తలకు అభినందనలు, కాంగ్రెస్‌ను ఆశీర్వ దించిన ప్రజలకు కృతజ్ఞతలు అని అన్నా రు. ఎన్నికలు సజావుగా నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు. సీఎం రేవం త్‌రెడ్డి గురువారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు.
‘మూ డు విడతలుగా జరిగిన 12,702 పంచాయతీలకు గా ను కాంగ్రెస్ పార్టీ 7,527, స్థానాల్లో, కాంగ్రె స్ రెబల్స్ 808 స్థానాల్లో గెలుపొందారని సీఎం చెప్పారు. ‘మొత్తం 8,335 పంచాయతీలను కాంగ్రెస్, కాంగ్రెస్ రెబల్స్ సాధించా రు. బీఆర్‌ఎస్, బీజేపీ ఒక కూటమిగా ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి. 3,511 స్థానాలు బీఆర్‌ఎస్, 710 స్థానాలు బీజేపీ గెలుచుకున్నాయి. బీఆర్‌ఎస్, బీజేపీ కూ టమి కలిసి మొత్తం 4,221 పంచాయతీలు (33 శాతం) గెలుచ్చుకున్నాయి. సీపీఐ, సీపీఎం, ఇతరు లు కలిసి 146 పంచాయతీలు, అంటే ఒక శాతం గెల్చుకున్నారు’ అని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.
మా బాధ్యతను పెంచాయి..
ఈ ఫలితాలను చూసి బీఆర్‌ఎస్ నేతలు అద్భుతమని అనుకుంటే సంతోషమని, మీ రు కోరుకున్నట్లే ఈ అద్భుతం 2029లో కూ డా జరుగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి జో స్యం చెప్పారు. 2/3 మెజార్టీతో 2029లో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, బీఆర్‌ఎస్‌కు 1/3తోనే సరిపెట్టుకుంటుందన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ కలిపి పోటీచేస్తే బీఆర్‌ఎస్ కంటే ఎక్కువగా 21 నియోజకవర్గాల్లో గెలిచామని, ఇప్పుడు 87 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధిక్యత సాధించామన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పట్టణ ప్రాంతాల్లో జరిగిన ఉప ఎన్నికలు కంటోన్మెంట్, జూబ్లీహిల్స్‌లోనూ కాంగ్రెస్‌కు స్పష్టమైన తీర్పు ఇచ్చారని చెప్పారు. ఉప ఎన్నికల సమయంలో రెఫరెండమని ప్రకటించిన బీఆర్ ఎస్ ఎక్కడపోయిందని సీఎం నిలదీశారు. తాము ప్రజలకు ఎల్లవేలా అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని సీఎ రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ పంచాయతీ ఫలితాలు తమ బాధ్యతను మరింత పెంచాయన్నారు.
ఏడో గ్యారెంటి కూడా..
కాంగ్రెస్ ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధ్ది ప్రధానమని, తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో సమపాలన అందించామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటిలే కాకుండా స్వేచ్చ, ప్రజాస్వామ్యం అనే ఏడో గ్యారెంటీని కూడా అమలు చేస్తున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వంలో ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలు లేవని, ప్రజాస్వామ్యబద్దంగా పాలన అందిస్తున్నట్లు చెప్పారు.
పంచాయతీ ఎన్నికల్లో అన్ని పార్టీల ప్రజలు స్వేచ్చగా ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగారని, ప్రజలు స్వేచ్చగానే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. ప్రభుత్వం ఎక్కడ కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడలేని, ఎన్నికలను ప్రభావితం చేయలేదని చెప్పారు. తమ ప్రభుత్వం ఈ రెండేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందన్నారు.
కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్న వరికి రూ. 500 బోనస్, వరి ధాన్యం పూర్తిగా కొనుగోలు, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సున్నా వడ్డీతో రుణాలు, 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ వర్గీకరణ, కుల గణన, 61 వేల ఉద్యోగాలు, మూతపడిన పాఠశాలు తెరవడం, టీచర్ల నియాయం వంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చిన మోదీ ప్రభుత్వం ప్రజలకు ఉపాధి అందకుండా కుట్ర చేస్తోందని సీఎం మండిపడ్డారు.
కేటీఆర్‌ను తప్పించాలని హరీష్‌రావు కుట్ర..
కాంగ్రెస్ పార్టీకి ఓడితే కుంగిపోవడం, గెలిస్తే పొంగిపోవడం అనేది ఉండదని సీఎం అన్నారు. బీఆర్‌ఎస్ నాయకులకు అధికారంపోయినా, పంచాయతీ ఎన్నికల్లో ఓడినా అహంకారం తగ్గడం లేదని దుయ్యబట్టారు. ఒకాయన కడుపులో మూసీ కంటే ఎక్కువగా విషం కనిపిస్తోందన్నారు. ఇప్పటికైనా అసూయను తగ్గించుకుని బాధ్యాతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించి తెలగాణకు నష్టం జరగకుడా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
కేటీఆర్ నాయకత్వంలో పార్టీ అన్ని ఎన్నికల్లో ఓడుతున్నదని హరీష్‌రావు ప్రచారం చేస్తున్నట్లుగా చెబుతున్నారని తెలిపారు. పార్టీ పదవి నుంచి కేటీఆర్‌ను తప్పించేందుకు హరీష్‌రావు కుట్ర చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరగుతోందన్నారు. ప్రజాస్వామిక కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు రక్షణ ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.
స్పీకర్ నిర్ణయంపై స్పందించం..
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై స్పీకర్ తీసుకున్న నిర్ణయానికి ఒక రాజకీయ పార్టీగా తాము స్పందించమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. స్పీకర్ తీర్పు నచ్చకపోతే కోర్టుకు వెళ్లొచ్చన్నారు. స్పీకర్ తీర్పుపై విమర్శలు చేయడం.. వారి అవగాహన రాహిత్యానికి తాను జాలిపడుతున్నానని అన్నారు. ‘అసెంబ్లీ సమావే శాల్లోనే హరీష్‌రావు తమ పార్టీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. మా సంఖ్యా బలాన్ని బట్టి మాట్లాడేందుకు సమయం కావాలని కోరారు. సభ ముగింపులోనూ ఏ పార్టీ నుంచి ఎంత మంది..
ఎంత సమ యం తీసుకున్నారని బులెటెన్ కూ డా ఇస్తారు. అంతేకాకుండా ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేల నుంచి రూ. 5 వేలు బీఆర్‌ఎస్‌ఎల్పీ ఖాతాలో జమఅవుతు న్నాయి. వారి పేరు మీద మైకులు, మాటలు, వాటాలు కావాలి.. ఇప్పు డు వాళ్లు మా పార్టీ వాళ్లు కాదంటున్నారు. ఎమ్మెల్యే నాగేందర్ అంశం ఆయనే చెబుతాడు. ’ అని సీఎం పే ర్కొన్నారు. ప్రధాని మార్పు అనే అంశం తనకు తెలియదని, ఆ పార్టీ చూసుకుంటుందని మీడియా అడిగిన ప్రశ్నకు సీఎం సమాధాన మిచ్చారు.
ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చకు రెఢీ..
కృష్ణా, గోదావరి బేసినల్లోని ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తే ప్రత్యేక అసెంబ్లీలో సమావేశాలు మూడు, నాలుగు రోజుల ఏర్పాటుచేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణలో భవన్‌లో సమావేశం ఏర్పాటుచేస్తున్న అంశంపై మీడియా ప్రశ్నించగా, సీఎంపై విధంగా సమాధానమిచ్చారు.
కేసీఆర్ హయాంలోనే కృష్ణా జలాల్లో అన్యాయం, ద్రోహం జరగిందని, తెలంగాణకు 299 టీఎంసీలు చాలని, ఏపీ ప్రభుత్వం 599 టీఎంసీలు తీసుకునేలా ఒప్పుకున్నారని, దీనిని ఆధారాలతో సహా అసెంబ్లీలో నిరూపిస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాకనే తెలంగాణకు రావాల్సిన హక్కులను సాధించామన్నారు. తమ ప్రభుత్వం వైపు ఏమైనా లోపం ఉంటే అసెంబ్లీలో ప్రశ్నించవచ్చనారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణలోనే ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు.
కేసీఆర్ బయటికి వస్తే ఏదో అద్భుతం జరుగుతుందనడమంటే అల్లాఉద్దీన్ అద్భుత దీపంగానే ఉంటుందన్నారు. ‘2023 ఎన్నికలకు కేసీఆర్ బయటనే ఉన్నాడు.. ఆయన క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నప్పడే ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని తిరస్కరించారు’ అని పేర్కొన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, కార్పోరేషన్ల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. ప్రతిపక్షాల సలహాలు, సూచనలు తీసుకుని ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.