calender_icon.png 19 December, 2025 | 1:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోయా కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన రైతన్న

19-12-2025 01:11:29 AM

జాతీయ రహదారి దిగ్బంధం

బేల, డిసెంబర్ 18(విజయక్రాంతి): సోయా పంటను కొనుగోలు చేయాలంటూ అన్నదాతలు రోడ్డెక్కారు. పంటను  పండించడం మొద లుకొని ఆ పంటను అమ్ముకునే రైతులకు కష్టా లు తప్పడం లేదు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పంట కొనుగోళ్లకు రైతులు ఆందోళన చేయగా, తాజాగా బేల మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై గురువారం రైతులు నిరసన వ్యక్తం చేసారు. రైతుల నిరసనకు బీజేపీ రాష్ట్ర నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు దేవన్న, గంబీర్ ఠాక్రే, బిపిన్ ఖోడే తదితరులు మద్దతు పలికారు.

రహదారిపై బైఠాయించిన నేతలు, రైతులు సోయా పంటను రోడ్డు పై పారపోసి, దాదాపు 4 గంటల పాటు రాస్తారోకో చేపట్టడంతో రోడ్డుకు ఇరువైపుల భారీగా వాహనాలు నిచిపోయాయి, ట్రాఫిక్ స్తంభించింది. దీంతో మార్కెట్ అధికారులు, పోలీసులు వచ్చి ఆందోళన కారులను సముదాయించిన వినకుండా భీష్మించుకుని కూర్చున్నారు. 

ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ... సోయా పంట కొనుగోలు కాకపోవ డంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. రోజుల తరబడి మార్కెట్ యార్డులో పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధన లేకుండా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రైతు దగ్గర నుంచి పంటను యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతంగా చేస్తామని హెచ్చరించారు.