30 March, 2026 | 2:16 AM

రా అండ్ రస్టిక్‌గా అనకాపల్లి టీజర్

30-03-2026 12:39 AM

విక్రమ్ సాహిదేవ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘అనకాపల్లి’. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం విడుదలైన ఈ సినిమా టీజర్‌తోనే హాట్ టాపిక్‌గా మారింది. ‘అనకాపల్లి.. ఇక్కడ మనకు కావాల్సింది దక్కాలంటే.. ఎదుటోడికి మనమంటే భయం ఉండాలి.. భయం లేనోడికి పిడికిలి రుచి చూపించాలి..

అదీ తెలిసినోడికి ఓబీ రుచి చూపించాలి.. అప్పటికీ లొంగకపోతే ఆడి పుర్రె పచ్చడయ్యేలా తూటాల వర్షం కురిపించాలి..  మనకి కావాల్సింది దక్కించుకోవాలి’.. అంటూ మొదలైన ఈ టీజర్లో అన్ని రకాల ఎమోషన్స్ చూపించారు. హీరో విక్రమ్ సాహిదేవ్. హీరో ఇచ్చే ఎంట్రీ మాస్ ఆడియన్స్ చాలా బాగా ఆకట్టుకుంది. అలాగే హీరోయిన్ సంధ్యా వశిష్ట అమాయకమైన చూపులతో, స్వచ్ఛమైన నవ్వుతో ఆకట్టుకుంది. ఇక అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకోబోతోన్నామని ఈ టీజర్‌తో టీం చెప్పకనే చెప్పేసింది. ఈ టీజర్‌లోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్, మ్యూజిక్ ఇలా అన్నీ కూడా రా అండ్ రస్టిక్‌గా ఉన్నాయి.

ప్రేమ కథ కూడా చాలా కొత్తగా ఉండబోతోన్నట్టు అనిపిస్తోంది. ఈ చిత్రానికి మాయా.వి కెమెరామెన్‌గా, దేవ్ జండ్ సంగీత దర్శకుడిగా, శ్రీకృష్ణ అట్టలూరి ఎడిటర్‌గా పని చేశారు. త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందింస్తున్నారు. సీనియర్ నటి ఇంద్రజ, త్రినాధరావు నక్కిన హీరో తల్లిదండ్రులుగా కీలక పాత్రల్లో, తారక్ పొన్నప్ప కీలక పాత్రల్లో కనిపించారు. సాంకేతికంగా ఈ సినిమా చాలా రిచ్‌గా ఉంది. ఈ మూవీని ‘సమ్మర్ 2026’ బరిలో ఒక గట్టి సినిమా రాబోతుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది.