సల్మాన్ సరసన..
ఇటు టాలీవుడ్ నుంచి అటు కోలీవుడ్ దాకా తన సత్తా చాటిన దక్షిణాది అందాల తార నయనతార. ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్‌ఖాన్ సరసన నటించే అవకాశం కొట్టేసింది. ‘జవాన్’ సెన్సేషన్ తర్వాత, ప్రస్తుతం సల్మాన్‌తో రొమాన్స్ చేసేందుకు సిద్ధమవుతోంది నయన్. సల్మాన్ సినిమాలో నయనతార నటిస్తోందన్న ఈ వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్ స్టార్ హీరోతో మన టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగు ఇండస్ట్రీకి చెందిన అగ్ర నిర్మాత దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ ముగ్గురి కాంబో సెట్ అవ్వడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ వచ్చే ఏప్రిల్లో పట్టాలపైకి వెళ్లనుందని సమాచారం. 2027 రంజాన్ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.




