ఇక రవాణా శాఖ అటాక్స్!
ఇతర రాష్ట్రాల వాహన యజమానులకు అలర్ట్
30 రోజులు దాటితే లైఫ్ ట్యాక్స్ చెల్లించాల్సిందే
జీవిత పన్ను చెల్లించకుంటే వాహనాల సీజ్
ఇటీవల పలు వాహనాలు స్వాధీనం
ఇతర రాష్ట్రాల వాహనాలకు ఆర్టీఏ అధికారుల హెచ్చరిక
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): ఇతర రాష్ట్రాలకు చెందిన కార్లు, మోటార్ సైకిళ్లు 30 రోజులకు మించి తెలంగాణ రోడ్లపై తిరిగితే నిబంధనల మేరకు వాహన జీవిత పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో సదరు వాహనాన్ని అధికారులు సీజ్ చేస్తారు. ఆ తర్వాత జరిమానా విధించడంతోపాటు యథావిధిగా లైఫ్ ట్యాక్స్ కూడా ముక్కుపిండి వసూలు చేస్తా రు. ఈ మేరకు ఆర్టీఏ అధికారులు ఇతర రాష్ట్రాల వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మరోవైపు సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాహనాలు 2014 వరకు ఏపీ రిజిస్ట్రేషన్‌తో ఉన్నాయి.
తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్న పదేళ్ల పాటు టీఎస్ రిజిస్ట్రేషన్‌తో వాహనాలకు నంబర్లు కేటాయించారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎస్.. టీజీగా మారింది. అయితే 2014 వరకు ఏపీ పేరుతో రిజిస్ట్రేషన్ అయిన అన్ని వాహనాలకు కొత్తగా లైఫ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని, అయితే 2014 నుంచి మాత్రం ఏపీ పేరిట రిజిస్ట్రేషన్ అయిన వాహనాలకు తెలంగాణలో 30 రోజులకు పైగా ఉంటే కచ్చితంగా లైఫ్ ట్యాక్స్ కూడా కట్టాల్సిందేనని అధికారులు తెలిపారు. ఏపీ అని ఉంది కాబట్టి తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్ వాహనాలను నెలకు మించి తిప్పుతామంటే వదిలిపెట్టబోమని అధికారులు స్పష్టం చేశారు.
రయ్య్‌మ్రంటున్న వాహనాలు
తెలంగాణలో ముఖ్యంగా రాష్ట్ర రాజధానిలో ఇతర రాష్ట్రాల వాహనాలు ఇబ్బడిము బ్బడిగా రోడ్లపైకి వస్తున్నాయి. హైదరాబాద్‌లో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు, వ్యాపారులు ఇక్కడ స్థిరపడుతున్నారు. చాలా మంది తమ సొంత రాష్ట్రాలకు చెందిన వాహనాలను తీసుకువచ్చి తెలంగాణ రోడ్లపై తిరుగుతున్నారు. నెల దాటితే వారి వాహనాలను సీజ్ చేసి వారితో లైఫ్ ట్యాక్స్ కట్టించాల్సి ఉన్నా... రవాణా శాఖలో ఉద్యోగుల కొరత కారణం గా పెద్దగా ప్రభావం కనిపించడంలేదు. ఏపీ కి చెందిన వాహనాలు అయితే తెలంగాణ వాహనాలతో పోటీ పడి రోడ్లపై కనిపిస్తున్నాయి.
వాటిలో 100శాతం లైఫ్ ట్యాక్స్ కట్టనివే ఉన్నాయి. ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, వ్యాపారులు, ఉద్యోగులు ఇలా అనేక మంది ఏపీకి చెందిన వారు ఆ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయించిన వాహనాలను ఏళ్ల తరబడి తెలంగాణలో తిప్పుతు న్నారు. ఈ వాహనాలను స్వాధీనం చేసుకుని జరిమానా విధించి, లైఫ్ ట్యాక్స్ వసూ లు చేయాల్సిన అధికారులు పెద్దగా స్పందించడం లేదనే విమర్శలున్నాయి. ఇక కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, కేరళ, గోవా తదితర రాష్ట్రాలకు చెందిన వాహనాలు హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున తిరుగుతున్నాయి.
ఇతర రాష్ట్రాల వాహనాలు నెల దాటితే సీజ్ చేస్తాం
రవాణా శాఖ నిబంధనల మేరకు ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు తెలంగాణలో నెల రోజుల కు మించి తిరిగితే వారు ఈ రాష్ట్రంలోనూ లైఫ్ ట్యాక్స్ చెల్లించాలి. లేదంటే వాహనాన్ని సీజ్ చేసి ట్యాక్స్ వసూలు చేస్తాం. రిజిస్ట్రేషన్ తర్వాత వాహనం వయసును బట్టి పన్ను రాబడతాం. తెలంగాణకు లైఫ్ ట్యాక్స్ చెల్లించకుండా ఇక్కడ నెలకు మించి రోడ్లపై తిరుగుతున్న ఏపీ, ఢిల్లీకి చెందిన పలు వాహనాలను సీజ్ చేశాం. భవిష్యత్తులోనూ ఇతర రాష్ట్రాల వాహనాలపై ప్రత్యేక నజర్ వేస్తాం.
రమేశ్, జాయింట్
ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్






