12 July, 2026 | 3:12 PM

Breaking News

ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •  

మంథనిలో పోచమ్మ ఆలయ భూమి కబ్జా

26-06-2024 12:21 AM

మంథని, జూన్ 25: పెద్దపల్లి జిల్లా మంథని ప్రధాన రహదారి పక్కనే ఉన్న పోచమ్మ ఆలయ భూమిని కొంతమంది నాయకులు కబ్జా చేసేందకు ప్రయ త్నిస్తున్నారని మంథని మత్స్యశాఖ అధ్యక్షుడు పోతారవేని క్రాంతి ఆరోపించారు. మంథని మున్సిపల్ పరిధిలో బోయినిపేటలోని గొల్ల గూడెం, తెనుగు గూడెం, దుబ్బ గూడెం ప్రజల ఆరాద్య దైవంగా భావించే పోచమ్మ ఆలయ భూమిని రాజకీయ నాయకుల అండతో కబ్జా చేస్తున్నారని క్రాంతి అవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.