3 May, 2026 | 1:49 AM

చదువులో రాణించండి.. మీ వెనుక మేముంటాం

26-06-2024 12:19 AM
  • సినీ నటి మంచు లక్ష్మి

కరీంనగర్, జూన్ 25 (విజయక్రాంతి): విద్యార్థులు కష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించే వరకు వారి వెంటే ఉంటామని టీచ్ ఆఫ్ చేంజ్ వ్యవస్థాపక చైర్‌పర్సన్, మేనేజింగ్ ట్రస్టీ, సినీ నటి మంచు లక్ష్మి అన్నారు. మంగళవారం కరీంనగర్‌లోని కోతిరాంపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ క్లాస్‌ను కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు చేయూత అందించాలనే ఉద్దేశంతోనే కరీంనగర్ జిల్లాలో 20 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసుకున్నామని తెలిపారు.

కాసేపు విద్యార్థులతో సరాదాగా ముచ్చటించారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లా డుతూ.. స్మార్ట్ క్లాస్ రూమ్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, డీఈవో జనార్దన్‌రావు, కార్పొరేటర్ మర్రి భావన, టీచ్ ఫర్ చేంజ్  సీవోవో ఆయుబ్, హెచ్‌ఎంలు సంపత్‌రావు, సతీష్ పాల్గొన్నారు.