ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడిగా అందె అశోక్
కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తా
చేర్యాల, జూన్ 18: అఖిల భారత కార్మిక సంఘాల కార్మిక సంఘాల సమాఖ్య (ఏఐటీయూసీ) సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడిగా అందె అశోక్ ఎన్నికయ్యారు. గురువారం చేర్యాల మండల కేంద్రంలోని సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా ఉపాధ్యక్షుడుగా బాధ్యతలు అప్పగించిన పార్టీ,కార్మిక సంఘం నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం,కనీస వేతనాల అమలు,సామాజిక భద్రత వంటి అంశాలపై కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.అశోక్ నియామకం పట్ల పలువురు కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.తమ ఎన్నికకు కృషిచేసిన ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కిష్టపురం లక్ష్మణ్, జిల్లా అధ్యక్షులు ఆది రంగారెడ్డి,జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.






