18 June, 2026 | 4:42 PM

Breaking News

గుడిసెల్లో నివసించే నిరుపేదలకే తొలి ప్రాధాన్యత – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు   •   తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు 120 స్టీల్ వాటర్ బాటిల్ ల పంపిణీ...   •   నకిలీ విత్తనాలు అమ్మితే కేసులు నమోదు   •   ప్రైవేట్ పాఠశాలల అక్రమ వసూళ్ల పై చర్యలు తీసుకోవాలి   •   బాసర ఐఐటీ సీటు సాధించిన విద్యార్థినికి సన్మానం   •   బిజినేపల్లిలో సారా తయారీదారులపై బైండోవర్ కేసులు   •   సీసీ కెమెరాలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే   •   ప్రభుత్వ పాఠశాలలో చదివితే బంగారు భవిష్యత్తు   •   ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడిగా అందె అశోక్   •   రైతులకు సర్కార్ శుభవార్త..! 30న 'రైతు భరోసా' నిధులు విడుదల   •  

రైతులకు సర్కార్ శుభవార్త..! 30న 'రైతు భరోసా' నిధులు విడుదల

18-06-2026 03:34 PM

హైదరాబాద్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రస్తుతం అనధికారిక మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఇందులో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రులు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశం 'రైతు భరోసా'( Rythu Bharosa) నిధుల విడుదల, ఇటీవలి రాజకీయ పరిణామాలు, మెట్రో రెండో దశ (Phase-2) అనుమతుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే వ్యూహాలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. 

వానాకాలం సాకుకు రైతు భరోసా ఇవ్వాలని రేవంత్ సర్కార్(Revanth Government) నిర్ణయించింది. ఈ నెల 30 నుంచి రైతు భరోసా నిధుల విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 30న మధిరలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించనుంది. రాష్ట్రంలో పండిన వరి ధాన్యం కొనుగోలుపై కూడా చర్చించారు. ఇదే సమయంలో, కాగిత రహిత పాలన దిశగా అడుగులు వేస్తూ 'తెలంగాణ డిజిటల్ క్యాబినెట్'(Telangana Digital Cabinet) విధానానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ఈ కొత్త విధానాన్ని సమీక్షించగా, క్యాబినెట్ అజెండాలు, పత్రాలను డిజిటల్ పద్ధతిలో వీక్షించేందుకు వీలుగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంత్రులకు ప్రత్యేక టాబ్లెట్లను పంపిణీ చేశారు.