calender_icon.png 11 November, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు

11-11-2025 12:32:16 AM

తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్‌రెడ్డి

ముషీరాబాద్, నవంబర్10 (విజయక్రాంతి):  తెలంగాణ రాష్ట్ర గేయం ‘జయ జయహే తెలంగాణ’ సృష్టికర్త, ప్రముఖ ఆశు కవి రచయిత డాక్టర్ అందెశ్రీఅకాల మరణం యావత్ తెలంగాణ  సమాజానికి తీరని లోటు అని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్, తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ మాజీ మెంబర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు.  ఎన్నో కార్మిక కర్షక తెలంగాణ సాధన కోసం జీవితాంతం కృషి చేసిన అందెశ్రీ  మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన సోమవారం ఒక ప్రకటనలో ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. మాయమైపో తున్నడమ్మా.. మనిషన్నవాడు అనే పాట ప్రజల మనసుల్లో నిత్యం మెదులుతుందన్నారు.