11-11-2025 12:31:19 AM
అంతర్జాతీయ యంగ్ రీసెర్చర్ అవార్డు
ఘట్ కేసర్, నవంబర్ 10 (విజయక్రాంతి) : అనురాగ్ యూనివర్సిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలోని అధ్యాపకులు డాక్టర్ మన్యం థైలేకు వియత్నాం దేశం హానోయ్లోని బ్యాంకింగ్ అకాడమీ ఆఫ్ వియత్నాంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో యంగ్ రీసెర్చర్ అవార్డు అనే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఈఅంతర్జాతీయ గౌరవం, ఎమర్జింగ్ టెక్నాలజీస్ రంగంలో డాక్టర్ మన్యం థైలే అసాధారణ కృషికి, సృజనాత్మక పరిశోధనలకు, ప్రభావవంతమైన సాంకేతిక పరిష్కారాల అభివృద్ధికి గుర్తింపుగా ప్రదానం చేయబడింది.
ఈఅవార్డు, ఆయన శాస్త్రీయ నిబద్ధత, పరిశోధనా వినూత్నత, గ్లోబల్ సహకారానికి అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. అనురాగ్ యూనివర్సిటీ తరపున అంతర్జాతీయ వేదికపై ప్రాతినిధ్యం వహించిన డాక్టర్ మన్యం థైలే విజయం ఆ విశ్వవిద్యాలయం ప్రపంచ ప్రమాణాల విద్య, పరిశోధన, ఆవిష్కరణల దిశలో ముందుకు సాగుతున్న దృష్టిని ప్రతిఫలిస్తుంది. ఈ విజయంపై స్పందిస్తూ డాక్టర్ మన్యం థైలే యూనివర్సిటీ నిర్వాహకులు, నాయకత్వం, సహచరులు, విద్యార్థులు, కుటుంబ సభ్యుల నిరంతర మద్దతు, ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు.