calender_icon.png 11 November, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ అభివృద్ధికి ఎస్. వై. ఆర్. ఫౌండేషన్ రూ. 6 లక్షలు విరాళం

11-11-2025 12:32:46 AM

ఘట్ కేసర్, నవంబర్ 10 (విజయక్రాంతి) : పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజిగూడలో నూతనంగా నిర్మించిన శ్రీ జగదాంబ మాత, శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ యువ నాయకుడు, ఎస్.వై.ఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి సామల సందీప్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రూ. 6లక్షలు ఆలయ అభివృద్ధి కోసం బంజారా పెద్దలకు విరాళంగా అందజేశారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ అభ్యున్నతికి, ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయం ఎప్పటికీ కొనసాగిస్తామని తెలిపారు. భగవంతుని ఆశీస్సులు మున్సిపాలిటీ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గూగుల్ గోవింద్ నాయక్, మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ ననావత్ రెడ్యా నాయక్, జితేందర్ నాయక్, రాకేష్, సంతోష్, విజయ్ సింగ్, ప్రశాంత్, వేణు, ఎస్. వై.ఆర్. ఫౌండేషన్ సభ్యులు, టీం ఎస్‌ఎస్‌ఆర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.