calender_icon.png 10 November, 2025 | 11:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందెశ్రీ మరణం తెలంగాణ ప్రజలకి తీరని లోటు!

10-11-2025 10:35:44 PM

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొడకంచి సుదర్శన్ గౌడ్!!

శివంపేట (విజయక్రాంతి): తెలంగాణ సాహితీ శిఖరం, ప్రజల కవి అందెశ్రీ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని, ఆవేదనను కలిగించిందని శివంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొడకంచి సుదర్శన్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందెశ్రీ మరణం సాహితీ లోకానికే కాదు మన అంధరికి తీరని లోటు. తెలంగాణ ఉద్యమంలో తన అక్షరాన్ని ఇంధనంగా మార్చి ప్రజల్లో నిత్య చైతన్యాన్ని జ్వలింపచేసిన గొప్పయోధుడు, నిత్యం పేదల పక్షాన గొంతుక వినిపించిన నిస్వార్థ తెలంగాణ మట్టి మనిషి అతను అని అన్నారు.

అందెశ్రీ భౌతికంగా మన మధ్య లేకపోయినా తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతమైన “జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం” గేయంగా నిత్యం ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని శివంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొడకంచి సుదర్శన్ గౌడ్ అన్నారు.