calender_icon.png 10 November, 2025 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవినీతిని నిరూపిస్తాం

10-11-2025 10:39:19 PM

మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబు

బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో జరుగుతున్న అవినీతిని నిరూపిస్తామని బెల్లంపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎం. సూరిబాబు అన్నారు. సోమవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. వార్డులలో కొంతమంది ఇందిరమ్మ ఇళ్ల ప్రెసిడెంట్ ఇస్తున్నారని, సీనియర్లను కలుపుకుపోవడం లేదని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో డబ్బులు తీసుకుంటున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఎమ్మెల్యే వినోద్ పేరును వాడుకుంటూ ఇందిరమ్మ ఇళ్ళు, డబుల్ బెడ్ రూమ్, భూముల కబ్జాల వ్యవహారాలను కొంతమంది నాయకులు చేపడుతున్నారని, వీరిని గుర్తించి ఎమ్మెల్యే వినోద్ సస్పెండ్ చేయాలని కోరారు.

రోడ్డు వెడల్పు లోబాధితుల నుండి తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని చెప్పారు. ఉపాధి కోల్పోయిన వ్యాపారులకు సింగరేణి ఫంక్షన్ హాల్, ఆటో గ్యారేజీ, పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట, పద్మశాలి భవన్ బద్దకల ఖాళీ స్థలంలో షాపులు పెట్టుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు. ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పట్టణంలోని గాంధీ చౌక్ రోడ్డు, కృష్ణ మందిర్ రోడ్డు, లాహోటి రోడ్డు, డబ్బు సెట్ లైన్, పోలీస్ స్టేషన్ రోడ్లను కూడా వెడల్పు చేసి ఇబ్బందులు తీర్చేలా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వినోద్ ను ఇళ్లల్లోకి డిన్నర్, లంచ్ లకి పిలుస్తూ కొంతమంది నాయకులు అక్రమ వ్యవహారాలు చక్కదిద్దుకుంటున్నారని ఆరోపించారు. వెంటనే వీరిని గుర్తించి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తమను పార్టీ నుండి సస్పెండ్ చేసిన వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. సమావేశంలో సీనియర్ నాయకులు ఎండి అఫ్జల్, గెల్లి జయరాం యాదవ్, పీక లక్ష్మణ్ తో పాటు పలువురు నాయకులు ఉన్నారు.