calender_icon.png 10 November, 2025 | 11:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల ఇంటరాక్షన్ లో కొన్ని కాలక్షేపం చేసిన వీడియో..

10-11-2025 10:32:32 PM

జేఎన్టీయూ ప్రిన్సిపాల్..

ర్యాగింగ్ కు అంటగట్ట వద్దు..

మల్యాల (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా నాచుపల్లి శివారులోని జెఎన్టియు కళాశాలలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడడం విద్యార్థుల ఇంటరాక్షన్ లో కొన్ని కాలక్షేప చేసిన వీడియో అని జేఎన్టీయూ ప్రిన్సిపాల్ అన్నారు. సోమవారం కళాశాలలో విలేకరు సమావేశంలో నిర్వహించారు. ఐదు రోజుల క్రితం క్యాంపస్ లో ఇద్దరు ఫస్ట్ ఇయర్ విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్న వీడియోలు విద్యార్థుల ఇంటరాక్షన్ లో కొన్ని కాలక్షేప చేసిన వీడియో అని తెలిపారు.

ఫస్ట్ ఇయర్ వాళ్లతో హెల్తి కమ్యూనికేషన్ ఇంటరాక్షన్ లో భాగంగా చేసిందే తప్ప ఎక్కడా జూనియర్లను వేధింపులకు గురి చేయడం ర్యాగింగ్ కు పాల్పడడం సరద కైనా ఇలాంటి ఆక్టివిటీస్ చేయవద్దని విద్యార్థులకు ప్రిన్సిపల్ సూచించారు. మంచి ప్రవర్తనతో, క్రమ శిక్షణతో కళాశాలకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చినటువంటి వాటిని ప్రిన్సిపాల్ ఖండించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని విద్యార్థులకు తగిన రక్షణ కల్పిస్తామని ప్రిన్సిపల్ తెలిపాడు.