calender_icon.png 11 November, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటు

11-11-2025 12:35:26 AM

 ఆమనగల్లు, నవంబర్ 10 (విజయ క్రాంతి): ప్రముఖ ఆశు కవి, సాహితీ వేత్త,  తెలంగాణ కు రాష్ట్ర గీతాన్ని అందించిన అందెశ్రీ మరణం తీవ్ర దిగ్బ్రాంతి కి గురిచేసిందని  సరికొండ ధర్మన్న సాహితీ వేదిక కన్వీనర్  కవి,రచయిత, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నేత గోపాల్ జీ, కో కన్వీనర్, రాష్ట్ర ఉపాధ్యాయుడు వెంకట స్వామి, సభ్యులు శంకర్, జిల్లా యువజన సంఘం నాయకులు అభినవరెడ్డిలు తెలిపారు.

సోమవారం హైదరాబాదు లోని లాలాపేటలో  అందెశ్రీ పార్ధి వదేవానికి అభినవరెడ్డి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా   ఆయన  మాట్లాడుతూ  అందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటన్నారు. మాయమైపోతున్నాడమ్మా మనీషన్నవాడు అనే పాటతోపాటు యావత్ తెలంగాణ ఉద్యమ సమయంలో  జయహో తెలంగాణ పాటతో పాటు ఎన్నో ఉద్యమ గీతాలు రచించిన ప్రజాకవి అని గుర్తు చేశారు. అందెశ్రీ మరణం యావత్ తెలంగాణ కు తీరని లోటని ముఖ్యంగా ఒక సాహితీ శిఖరం నేలకొరిగిందని వారి ఆత్మ కు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని వారు తెలిపారు.