calender_icon.png 11 November, 2025 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీలకు 20 శాతం రిజర్వేషన్ల కోసం ఉద్యమం

11-11-2025 12:36:32 AM

ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి

ముషీరాబాద్, నవంబర్ 10(విజయక్రాం తి): జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించి, పెరిగిన జనాభాకు అనుకూలంగా ఎస్సీల రిజర్వేషన్ పెం చాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ‘ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితి’ ఆవిర్భావ సమావేశానికి పిడమర్తి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.

దశాబ్దాల క్రితం ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించారని ఇప్పుడు పెరిగిన జనాభాకు అనుగుణంగా 20% రిజర్వేష న్లు కేంద్ర ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం లేదా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన ఇంటిం టి కులగణన ఆధారంగా ఎస్సీ రిజర్వేషన్లు 20 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పులిజాల గెలువయ్యను నియమించా రు.

ఈ సమావేశంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు దీపక్ కుమార్, బిఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బోరెల్లి సురేష్, దీపక్ కుమార్, గజ్జల మల్లికార్జున్, బొమ్మెర స్టాలిన్, డా.మీసాల మల్లేష్, ఎర్రమళ్ళ మొగిలయ్య, వరలక్ష్మి, నక్క మహేష్, బుర్ర సురేష్, జోగు గణేష్, శోభన్ బాబు, కృష్ణ, చాగంటి శేఖర్, నరేష్ పాల్గొన్నారు.