calender_icon.png 4 September, 2025 | 4:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసరి సముద్రంలో ఆంధ్ర జాలర్లు..!

04-09-2025 02:12:40 PM

నాగర్ కర్నూల్ ప్రాంత చేపలను ఆంధ్ర ప్రాంతానికి అక్రమ తరలింపు. 

పట్టించుకోని అధికారులు.

నష్టపోతున్న స్థానిక మత్స్యకారులు.

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ కేసరి సముద్రం చెరువులో ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు జాలర్లు(Andhra fishermen) అక్రమంగా చేపలను పట్టుకుని ఆంధ్రకు తరలిస్తున్నట్లు స్థానిక మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాంత మత్స్యకారులకు డబ్బులు ఆశచూపి దళారులు బెస్త వారు అరాస్ పాట పాడి అక్రమంగా చేపలను ఇతర రాష్ట్రాలకు దేశాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని స్థానిక మత్స్యకారులు పలుమార్లు అధికారులు, కోర్టు దృష్టికి తీసుకువెళ్లి పోరాటం చేశారు.

చివరికి హైకోర్టు సైతం స్థానిక మత్స్యకారులే చేపలను పట్టుకొని జీవనం కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొంతమంది స్థానిక దళారులు మత్స్యకారులతో సొసైటీ సభ్యులతో చేతులు కలిపి స్థానిక చెరువుల్లోని చేపలను అక్రమంగా పట్టుకొని ఆంధ్ర ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు స్థానిక మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. గురువారం నాగర్ కర్నూల్ కేసరి సముద్రం చెరువులో అనుమతి లేకుండా మర బోట్ల సహాయంతో చేపలు పడుతూ కనిపించడంతో స్థానిక మత్స్యకారులు వారితో గొడవకు దిగారు. ఈ విషయాన్ని జిల్లా మత్స్యశాఖ అధికారులకు, పోలీసులకు చెప్పినా పట్టించుకోవడంలేదని స్థానిక మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.