04-09-2025 03:05:08 PM
సంచలన తీర్పు ఇచ్చిన పోక్సో కోర్టు
నల్లగొండ టౌన్, (విజయ క్రాంతి): నల్లగొండ జిల్లాలో వేర్వేరు మండలాల్లో ఇద్దరు బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ నల్లగొండ పోక్సో కోర్టు(Nalgonda POCSO Court) గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. దేవరకొండ మండలం గొట్టిముక్కల గ్రామంలో 2018 మార్చి 9 న భాస్కరాచారి అనే నిందితుడు మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసు పై విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష రూ. 25 వేల జరిమానా, బాధితురాలికి రూ. పది లక్షల పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది.
చండూరు మండలం ధోని పాముల గ్రామానికి చెందిన నిందితుడు తిప్పర్తి యాదయ్య మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. దీనిపై 2016లో చండూరు పోలీసే స్టేషన్లో(Chandur Police Station) కేసు నమోదైంది. అప్పటినుంచి నుంచి వాదనలు కొనసాగుతుండగా గురువారం ఫోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడికి 22 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.35 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇ చ్చింది. అంతేకాకుండా బాధిత కుటుంబానికి నిందితుడు రూ.10.50లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.