04-09-2025 03:02:40 PM
హైదరాబాద్: రాయదుర్గంలో గణేశ్ లడ్డూ రికార్డు ధర(Ganesh Laddu record price) పలికింది. మైహోమ్ భుజాలో వేలంలో గణేశ్ లడ్డూ రూ. 51,77,777 పలికింది. ఇల్లెందుకు చెందిన గణేశ్ లడ్డూ దక్కించుకున్నారు. గతేడాది రూ. 29 లక్షలకు గణేశ్ లడ్డూ దక్కించుకున్నారు. అటు హుస్సేన్‌సాగర్ చుట్టూ వినాయక నిమజ్జనాల సందడి మొదలైంది. నగరం నలువైపుల నుంచి గణనాథులు హుస్సేన్‌సాగర్‌కి చేరుకుంటున్నారు. నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్ వైపు మాత్రమే నిమజ్జనాలకు అనుమతి ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ, పోలీసులు, ఇతర శాఖల సమన్వయంతో భారీ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం హుస్సేన్‌సాగర్ వద్ద 20 క్రేన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.