04-09-2025 02:10:55 PM
కలెక్టర్ వెంకటేష్ దోత్రే
కుమ్రం భీంఆసిఫాబాద్( విజయక్రాంతి): శ్రద్ధతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(Collector Venkatesh Dhotre) విద్యార్థులకు సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాలను సందర్శించారు. మోడల్ స్కూల్ లోని వంటగదిని డార్మెంటర్ ను పరిశీలించారు. విద్యార్థులు తరగతి గదిలో ఉపాధ్యాయ వేషధారణలో తోటి విద్యార్థులకు బోధించారు. అనంతరం కలెక్టర్ ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు మ్యాథమెటిక్స్ సబ్జెక్టులోని పలు అంశాలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులు లక్ష్యాలను ఎంచుకొని ఆ దిశగా ముందుకు సాగాలని తెలిపారు.విద్యతోనే భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలబడే అవకాశం ఉంటుందని సూచించారు.తల్లిదండ్రుల ఆశయాలను పిల్లలు నెరవేర్చాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మహేశ్వర్,సిబ్బంది పాల్గొన్నారు.