04-09-2025 02:14:53 PM
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి(Kancharla Bhupal Reddy) గురువారం నల్లగొండపట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. 18 వార్డు లో వినాయక ప్రత్యేక పూజలో పాల్గొని భారీ గజమాలతో స్వామివారిని అలంకరించి, అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, మాజీ కౌన్సిలర్ లు కొండూరు సత్యనారాయణ,మారగోని గణేష్ గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, నాయకులు కొంగల సైదులు, వింజమూర్ లక్ష్మణ్, కొప్పు శ్రీకాంత్, మేడి నరసింహ, అంబటి శివ, బబ్లు ధనుష్, సాయి, రాజు, శివ, సతీష్ తదితరులు పాల్గొన్నారు.