18 July, 2026 | 4:53 PM

అమెరికాలో ఆంధ్రా విద్యార్థిని మృతి

16-12-2024 01:26 AM

టెన్నెస్సీ, డిసెంబర్ 15: అమెరికాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమా దంలో ఓ భారత విద్యార్థిని మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నాగశ్రీ వందన పరిమళ (26) 2022లో అమెరికాకు వెళ్లింది. టెన్నెస్సీ రాష్ట్రంలోని మెంఫిస్ విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ సైన్స్ చదువు తోంది. శుక్రవారం పవన్, నిఖిత్ అనే స్నేహితులతో కలిసి కారులో బయటకు వెళ్లింది.

రాత్రి తిరిగి కారులో వస్తుండగా రాక్‌వుడ్ ఎవెన్యూ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొ ట్టింది. ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జయింది. ఘటనలో నాగశ్రీ తీవ్రగాయా ల పాలై అక్కడికక్కడే మృతిచెందింది. పవన్, నిఖిత్‌కు గాయాలయ్యాయి. వీరిద్దరూ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పవన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మరోవైపు నాగశ్రీ మృతదేహాన్ని ఇండియాకు పంపించేందుకు టెన్నెస్సీకి చెందిన తెలుగు సంఘాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.