5 August, 2026 | 1:50 AM

ప్రభుత్వ భూమి కబ్జాను అడ్డుకోండి..

05-08-2026 12:58 AM

మున్సిపల్ కమిషనర్‌కు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల ఫిర్యాదు

తాండూర్, ఆగస్టు 4 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ భూమిసర్వే నెం. 135 కబ్జాకు గురవుతుందని అక్రమంగా నిర్మాణాలు సైతం చేపడుతున్నారని మంగళవారం మున్సిపల్ కమిషనర్ కు భారత రాష్ట్ర సమితి మున్సిపల్ కౌన్సిలర్లు ఇర్షాద్, వివేకానంద్ ఫిర్యాదు చేశారు. గతంలో సర్వే నెం. 111లో వివాదాస్పద నిర్మాణాలు, ఆక్రమణలతో సంబంధం ఉన్న అక్రమార్కులే ఇప్పుడు సర్వే నెం. 135లోని ప్రభుత్వ భూమిలో కూడా నిర్మాణాలు జరుపుతున్నారని వారు ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొన్నారు.