26-09-2024 02:16:48 PM
పాపన్నపేట: ఎగువ సింగూరు ప్రాజెక్టు నుంచి మంగళవారం ఉదయం నీటిని విడుదల చేయడంతో ఏడుపాయల శ్రీవన దుర్గామాత ఆలయం ముందు నుంచి మంజీరా ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో మంగళవారం నుంచి వనదుర్గామాత రాజగోపురంలోనే పూజలందుకుంటుంది. వరద ఉద్ధృతి తగ్గిన వెంటనే తిరిగి ప్రధాన ఆలయంలో భక్తులకు దర్శనం కల్పిస్తామని అధికారులు వెల్లడించారు. కాగా గత నెలరోజుల నుంచి ప్రధాన ఆలయంలో కాకుండా రాజగోపురంలో దర్శనం కల్పించడం ఇది మూడోసారి.