17 April, 2026 | 11:57 AM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

అంగన్‌వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, పర్మినెంట్ చేయాలి

21-06-2025 02:19 AM

సూర్యాపేట, జూన్ 20 (విజయక్రాంతి) : అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం సూర్యాపేట ప్రాజెక్ట్ పరిధిలోని అంగడి వాడి టీచర్స్ ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంగడి వాడి టీచర్ ల కనీస వేతనాలు రూ.26 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కేంద్రము లోని బీజేపీ ప్రభుత్వం స్కీమ్ వర్కర్ల పేరుతో అంగడి వాడి కేంద్రాలలో పని చేస్తున్న టీచర్లను, హెల్పర్లను కట్టు బానిసలుగా చూస్తూ,కనీస వేతనాలు కూడా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అంగడి వాడి కేంద్రాలకు పక్క భవనాలు నిర్మించాలని, పని భారం తగ్గించాలన్నారు. జులై 9న తేదీన జరుగు సార్వత్రిక సమ్మె లో అంగడి వాడి టీచర్స్, హెల్పర్స్ అందరు పాల్గొనాలనీ ఆయన పిలుపు ఇచ్చారు.

ఈ సమావేశంలో అంగడి వాడి టీచర్స్, హెల్పర్స్ జిల్లా కార్యదర్శి బొలిశెట్టి భాస్కరమ్మ, మంజుల, లక్ష్మీ,సీఐటీయూ జిల్లా కమిటి సభ్యులు రణపంగి కృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి ధనియాకుల శ్రీకాంత్, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జె నర్సింహ రావు, సీఐటీయూ జిల్లా నాయకులు ఎం వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.