అంగన్‌వాడీలకు జీతాల్లేవు.. మహిళలను కోటీశ్వరులను చేస్తారా?: భూపతి శ్రీనివాసరావు
పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలి
కొత్తగూడెం,(విజయక్రాంతి): టిఆర్ఎస్ పార్టీ బిసిసెల్ జిల్లా నాయకులు భూపతి శ్రీనివాసరావు రెండు నెలలుగా 62 వేల మంది అంగన్‌వాడీ సిబ్బందికి వేతనాలు చెల్లించలేని కాంగ్రెస్ ప్రభుత్వం, మహిళలను కోటీశ్వరులను చేస్తామని ఎలా చెబుతోందని భూపతి పత్రికా ముఖంగా ప్రశ్నించారు. పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేసి మహిళల పట్ల గౌరవం ఉందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
అంగన్‌వాడీల సేవలను గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వం వారి హోదాను అంగన్‌వాడీ టీచర్లుగా ఉన్నతీకరించారని *2014లో టీచర్లకు రూ.4,200, సహాయకులకు రూ.2,200 వేతనం ఉండగా, బీఆర్‌ఎస్ హయాంలో టీచర్ల వేతనం రూ.13,650కు, మినీ అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనం రూ.7,800కు పెంచామని పేర్కొన్నారు. అభయహస్తం మేనిఫెస్టోలో అంగన్‌వాడీ టీచర్ల వేతనాన్ని రూ.18 వేల వరకు పెంచుతామని ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకువస్తామని, కాంగ్రెస్ హామీ ఇచ్చిందని భూపతి గుర్తుచేశారు 30 నెలలు గడిచినా చర్యలు లేవని విమర్శించారు. అప్‌గ్రేడ్ చేసిన మినీ అంగన్‌వాడీ లను గుర్తించాలని ఈ సందర్భంగా తెలియజేశారు భూపతి శ్రీనివాసరావు.






