12 June, 2026 | 8:28 PM

గాలివాన బీభత్సం... ఇండ్లు చెల్లచెదురు.!

12-06-2026 07:20 PM

• ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు

ధర్మపురి,(విజయక్రాంతి): వెల్గటూర్ మండలంలో శుక్రవారం కురిసిన భారీ వర్షం ఎన్నో పేద కుటుంబాల ఇండ్లను చెల్లా చెదురు చేసి నిరాశ్రయుల్ని చేసింది. మండలంలోని రాజక్కపల్లి గ్రామానికి చెందిన రంగు సత్తయ్య అనే నిరుపేద ఇంటి రేకులు గాలివానకు పూర్తిగా ఎగిరిపోయాయి. ఉన్న రేకుల ఇళ్ళు కాస్తా చెల్లాచెదురు కావడంతో కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రభుత్వం చొరవ చూపి ఎలాగైనా తమ కుటుంబాన్ని ఆదుకోవాలానీ, ఆదుకునేలా ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలనీ రంగు సత్తయ్య కుటుంబం ప్రాదేయపడుతుంది.