1 September, 2026 | 12:47 AM

అంగన్వాడీలకు అడ్డగోలు దరఖాస్తులు సిఫార్సు లేఖలతో ఒత్తిడి

01-09-2026 12:07 AM
  1.    44 పొస్టులకు 1593 మంది
  2. ఒక్క మొగ్ధుమ్ పూర్ కే 141 మంది
  3. నేటి నుండి సర్టిఫిజిట్‌ల పరిశీలన   

కరీంనగర్, ఆగస్టు 31 (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లాలో అంగన్ వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తులు అడ్డగోలుగా వచ్చాయి. జిల్లావ్యాప్తంగా 44 పోస్టులు ఖాళీగా ఉంటే 1593 దరఖాస్తులు అందాయి. ఐసీడీఎస్ కరీంనగర్ అర్బన్ ప్రాజెక్టు పరిధిలో 8 పోస్టులకు 609, ఐసీడీ ఎస్ గంగాధర ప్రాజెక్టు పరిధిలో 20 పోస్టులకు 535, హుజురాబాద్ ప్రాజెక్టు పరిధిలో 16 పోస్టులకు 449 దరఖాస్తులు అందాయి.

అంగన్వాడీ టీచర్ పో స్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ స్పం దనగా ఆన్లైన్ ద్వారా ఐసీడీఎస్ ప్రాజెక్టు, క రీంనగర్ (అర్బన్) పరిధిలోని 8 అంగన్వాడీ కేంద్రాలకు మొత్తం 609 దరఖాస్తులు అం దాయి. ఇందులో అత్యధికంగా మొగ్ధుమ్ పూర్-1 కేంద్రానికి జనరల్ కేటగిరి క్రింద కేటాయించిన ఒక టీచర్ పోస్టుకు 141 దరఖాస్తులు అందాయి. దు బ్బపల్లి ఎస్ సి జనరల్ కు 21, ఖాజీపూర్ బిసి-ఏ కు కే టాయించిన పోస్టుకు 75, జ నరల్ కు కేటాయించిన శ్రీరాములపల్లి కేంద్రానికి 115, ఎస్ సి జనరల్ కు కే టాయించిన గూడెం కేంద్రానికి 69 దరఖాస్తులు అందాయి.

దివ్యంగులకు కేటాయిం చిన అసిఫ్ నగర్-2 కేంద్రానికి 4, ఎస్ టి లకు కేటాయించిన మారుతినగర్ కేంద్రం పోస్ట్ కోసం 59, ఎస్ సి జనరల్ కు కేటాయించిన సుభాష్ నగర్ అంగన్ వాడి కేంద్రం టీచర్ పోస్ట్ కోసం 125 దరఖాస్తులు అందాయి. అంగన్వాడీ టీచర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ ల పరిశీలన నేటి నుండి సెప్టెంబర్ 5 వరకు ఉంటుంది.

కేటాయించిన తేదీన అసలు ధృవపత్రాలు , ఒక రెండు అటెస్టెడ్ జిరాక్స్ ప్రతులతో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావలసి ఉంటుంది. స ర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కానీ అభ్యర్ధులు నియామక ప్రక్రియలో అనర్హులుగా పరిగణించబడును. అనంతరం ఎటువంటి అవ కాశం కల్పించబడదని సమగ్ర శిశు అభివృ ద్ధి సేవ పథకాధికారిణి కార్యాలయం ఐసిడియస్ ప్రాజెక్టు కరీంనగర్ (అర్బన్) అధికారి ప్రకటించారు.

సిఫార్సు లేఖలు..

అంగన్వాడీ పోస్టులకు అధికార పార్టీ నే తల నుంచి భారీస్థాయిలో పైరవీలు జరుగుతున్నాయి. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యే లు, నియోజకవర్గ ఇంచార్జి లు సిఫార్సు లేఖలను జారీ చేశారు. పోస్టులు ఇప్పిస్తామం టూ పలువురు అభ్యర్థులకు, ఆశావహులకు మాట ఇచ్చిన అధికార పార్టీ నేతలు.. ఆ సి ఫార్సు లేఖను వారికి అప్పగిస్తున్నారు. దీం తో ఆయా అభ్యర్థులు, సదరు సిఫార్సు లేఖ ను జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో అం దజేస్తున్నారు.

ఫలానా పోస్టు మేం చెప్పిన వాళ్లకు కచ్చితంగా రావాల్సిందే’ అంటూ హుకుం జారీ చేస్తున్నారు. మరికొంతమంది సర్పంచ్లు కూడా ఐసీడీఎస్ సూపర్వైజర్లకు ఫోన్లు చేసి ‘మా క్యాండిడేట్ ఐప్లె చేశారు. చూడండి. తప్పనిసరిగా పోస్టు రావాలి’ అం టూ స్పష్టం చేస్తున్నారు.

మరికొందరు ప్రజాప్రతినిధులు మంత్రుల తరఫున కూడా అధి కారులకు ఫోన్లు చేస్తున్నారు.కలెక్టర్ సమక్షం లో ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఇంటర్లో అత్యధికంగా వచ్చిన మార్కుల ఆధారంగా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని కమిటీ ఆమోదంతో పోస్టులు కేటాయిస్తారు. స్థానికత ముఖ్యం. నిబంధనలనే ప్రామాణికంగా తీసుకుంటారని సంబంధిత అధికారులు అంటున్నారు చూడాలి మరి.