కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అంగన్వాడీలు
మున్సిపల్ చైర్మన్ చిమ్ముల సంధ్య గోవర్ధన్ రెడ్డి
గుమ్మడిదల, ఏప్రిల్ 21 : కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ అంగన్వాడీలను అభివృద్ధి చేస్తున్నామని గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ చిమ్ముల సంధ్య గోవర్ధన్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి అంగన్వాడి కేంద్రంలో మంగళవారం అంగన్వాడి టీచర్ల ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.చిన్నారులు ప్రత్యేక వేషధారణలో ఆకట్టుకున్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె వేడుకలను వీక్షించారు. ఈ సందర్భంగా సంధ్య గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ చిన్నారులకు ప్రీ స్కూల్ దశలోనే నాణ్యమైన విద్య అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. వార్డు కౌన్సిలర్లు గిద్దె విజయలక్ష్మి, సురభి కుమార్ గౌడ్, శ్రీచూర్ణం చక్రపాణి,నాయకులు సురభి నాగేందర్ గౌడ్, ఆలేటి శ్రీనివాస్ రెడ్డి, చప్పటి మహేష్, మల్లన్నగారి రమేష్ అంగన్వాడి సూపర్వైజర్ కవిత,అంగన్వాడీ టీచర్లు తల్లిదండ్రులు నాయకులు పాల్గొన్నారు.






