సదాశివుడి ఆలయంలో ఎంపీ ప్రత్యేక పూజలు
22-04-2026 12:00 AM
సదాశివపేట, ఏప్రిల్ 21 : సదాశివపేట మండలం కొల్కూర్ గ్రామ సమీపంలోని ప్రసిద్ధ సదాశివుడి ఆలయంలో మంగళవారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకునారు. ఆలయానికి విచ్చేసిన ఎంపీ రఘునందన్ రావుకు స్థానికులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఆయన ఎడ్ల బండిపై ప్రయాణిస్తూ గ్రామంలో సందడి చేశారు. సంప్రదాయ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఎంపీ ఎడ్లభండిపై ప్రయాణించడం గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించడంతో పాటు అందరిలో ఉత్సాహాన్ని నింపింది.






