28 June, 2026 | 2:59 PM

Breaking News

ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •  

అంకుశాపూర్‌లో పశు ఆరోగ్యఫెర్టిలిటీ క్యాంపు నిర్వహణ

09-05-2026 01:07 AM

ఘట్ కేసర్, మే 8 (విజయక్రాంతి): ఘట్కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధిలోని అంకుశాపూర్ లో శుక్రవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఫెర్టిలిటీ క్యాంపు-హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశువుల ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు, రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. క్యాంపులో మొత్తం 265 పశువులను పరీక్షించి చికిత్స అందించగా, 42 మంది రైతులు లబ్ధి పొందారు. అలాగే పశువుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు క్యాటిల్ ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో 22 పశువులు పాల్గొన్నాయి. పశువులకు పోషకాహారం అందించేందుకు 50 కిలోల పశుగ్రాస విత్తనాలను 5 మంది రైతులకు పంపిణీ చేశారు. పశువుల సంరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి, 42 మంది రైతులకు సూచనలు చేశారు. వేసవిలో పశువులకు తగినంత నీరు, పచ్చి మేత అందించడంతో పాటు ఎండ తీవ్రత నుంచి రక్షించే చర్యలు తీసుకోవాలని అధికారులు రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ (ఉప్పల్) డాక్టర్ శ్రీనాథ్, డాక్టర్ పద్మిని, శేఖర్ రెడ్డి, భూషణ్, శ్రీనాథ్ రైతులు పాల్గొన్నారు.